Site icon Quickon

Love Story Review

టైటిల్‌ : లవ్‌స్టోరి
నటీనటులు : నాగ చైతన్య , సాయి పల్లవి, ఈశ్వరీరావు తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్
నిర్మాతలు : కె. నారాయణ్‌దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు
దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల
సంగీతం : పవన్‌ సీహెచ్‌
సినిమాటోగ్రఫీ : విజయ్‌.సి.కుమార్‌
ఎడిటింగ్‌: మార్తాండ్ కె వెంకటేష్
విడుదల తేది : సెప్టెంబర్‌ 24, 2021

‘దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా వస్తోన్న సినిమా “లవ్ స్టోరి”. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రేవంత్ (నాగచైతన్య) హైదరాబాద్ లో జుంబా సెంటర్ నడుపుతూ ఉంటాడు. అతను ఉండే ఇంటి పక్క ఇంట్లో దిగుతుంది మౌనీ అలియాస్ మౌనిక (సాయిపల్లవి). జాబ్ కోసం ఊరు నుంచి వస్తోంది. కొన్ని ప్రయత్నాలు తర్వాత జాబ్ రాకపోవడంతో మౌనిక కూడా రేవంత్ జుంబా సెంటర్ లో పార్టనర్ గా జాయిన్ అవుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఇద్దరి మధ్య రిలేషన్ బిల్డ్ అయి ప్రేమలో పడతారు. అయితే ఇద్దరు కులాలు వేరు కావడం, వారి ప్రేమకు అడ్డంకి అవుతుంది. ఆ అడ్డంకులను దాటుకుని రేవంత్ – మౌనీ తమ ప్రేమను ఎలా గెలుచుకున్నారు ? ఈ క్రమంలో ఒకరి కోసం ఒకరు ఏమి చేశారనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్లు
చైతన్య, సాయిపల్లవి
పాటలు
నేపథ్యసంగీతం
కొన్ని సన్నివేశాలు

మైనస్ పాయింట్లు
బలమైన కథ లేకపోవడం
లెంగ్తీ నెరేషన్


తీర్పు:

సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా వచ్చిన ఈ లవ్ స్టోరి ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల ప్రేమకు సంబంధించి మంచి కథను తీసుకుని మంచి ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. అలాగే ప్రేమలో కులం సమస్య తాలూకు పర్యవసానాలను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఐతే, చైతు, సాయి పల్లవి తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తoమ్మీద ఈ చిత్రం మెప్పిస్తోంది.

Quickon.inRating : 3.25/5

Exit mobile version