MoviesTelugu Movie Reviews

Kambalapalli kathalu Chapter 1 Mail Movie Review

సంక్రాంతి వేళ థియేటర్లలో పెద్ద సినిమాలే కాదు.. ఓటీటీలో ఓ చిన్న సినిమా కూడా ప్రేక్షకులను పలకరించింది. అదే.. మెయిల్. ‘ఆహా’ ద్వారా విడుదలైన ఈ చిన్న సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

నటీనటులు : ప్రియదర్శి, హర్షిత్ మాల్గిరెడ్డి, మణి ఏగుర్లా, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, వన్నార్న్, శ్రీకాంత్ పల్లె
దర్శకుడు: ఉదయ్ గుర్రాల
నిర్మాత: ప్రియాంక దత్, స్వప్న దత్
సినిమాటోగ్రఫీ : ఉదయ్ గుర్రాలా, శ్యామ్ దుపతి
సంగీత దర్శకుడు: స్వీకర్ అగస్తి
ఎడిటర్: హరిశంకర్ టిఎన్

మూవీ స్టోరీ..
పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా మొదలవుతుంది. ఇక ప్రారంభం నుంచి ఆసక్తికరంగా ఉండగా.. కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులను వినోదాన్ని అందిస్తాయి. కంప్యూటర్ పై హీరోకి ఉన్న ఇష్టం.. అందుకు సంబంధించిన కోర్సు నేర్చుకోవడానికి పడే తాపత్రాయన్ని హీరో రవికుమార్ పాత్ర మనసుకు తాకుతుంది. ఆ ఉర్లో అదే సమయంలో కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ప్రారంభం కాగానే అక్కడ జాయిన్ అవుతాడు రవి. ఆ కోచింగ్ సెంటర్‏గా హైమత్ (ప్రియదర్శి) రవి కోసం ఒక జీ మెయిల్ క్రియేట్ చేస్తాడు. అయితే అకౌంట్‏కు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ రావడం వలన ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం కూడా అప్పట్లో ఇలానే ఉండేది కదా అని గుర్తుచేసుకునేలా ఉంటుంది. ప్రియదర్శి పాత్ర మొత్తం కామెడీ ఎంటర్ టైనర్‏గా ఉంటుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నటన సహజంగా అనిపిస్తుంది.

చివరిగా : కామెడీ మూవీ చూసి చాల రోజులు అయింది అనుకునే వారు కచ్చితంగా చూడాల్సిందే. నేను ఐతే చాలా బాగా ఎంజాయ్ చేశా ఈ సినిమా చూసినంతసేపు . ప్రతి ఒక్కరికి తప్పకుండ నచ్చే మూవీ అని అనటం లో సందేహం ఏమి లేదు.

నా సలహా : ఫ్యామిలీ తో కలిసి అందరూ ఇంట్లోనే చూడండి. చాలా రోజుల తరువాత ఒక మంచి మూవీ చేసాం అనే ఫీలింగ్ ఐతే కన్ఫర్మ్గా వస్తుంది.

Platform To Watch This Movie :- Aha OTT Network

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please Disable Adblocker